- పాల్గొన్న మంత్రి వాకిటి శ్రీహరి గారి సతీమణి వాకిటి లలిత.
- మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు.
- వార్డు కౌన్సిలర్ అల్కూరి పావని.
మన ధ్యాస, మక్తల్: స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి పురస్కరించుకుని మక్తల్ మున్సిపాలిటీ 16వ వార్డులో 8 ఇందిరమ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు చేసుకోగా,మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి సతీమణి వాకిటి లలిత చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,మక్తల్ నియోజకవర్గం లో ఏకంగా 3500 ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయని, మరో 2500 ఇందిరమ్మ ఇండ్ల కు అతి త్వరలో మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అనుమతులు తీసుకువస్తారని తెలిపారు.ఇప్పటికే నియోజకవర్గం లో ఏకంగా 2800 కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్న, మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ వైస్ చైర్మన్ గణేష్ కుమార్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అల్కూరి రవికుమార్, మార్కెట్ డైరెక్టర్ శాలం, మున్సిపల్ కౌన్సిలర్ రహీం పటేల్, కోఆప్షన్ మెంబర్లు వల్లంపల్లి లక్ష్మణ్, శంషుద్దీన్, లాలా, స్థానిక నాయకులు శేఖర్, ఆనంపల్లి రమేష్, మహమ్మద్, వలియుద్దీన్, రంజాన్ రాజా, గంగాధర్, గుడేబల్లూరు నాగరాజ్, బాల్ రాజ్, ప్రవీణ్ కుమార్, జగదీష్, తుకారం, కీర లింగ,అంబదాస్, శేఖర్, తదితరులు పాల్గొన్నారు.
