మన ధ్యాస, మక్తల్: నారాయణపేట జిల్లా కేంద్రంలోని జిల్లా జడ్జి బి.శ్రీనివాసులును మక్తల్ లాయర్స్ అడ్ హక్ కమిటీ అధ్యక్షులు దేవసూగురు తిమ్మన్న మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం డిస్టిక్ కోర్ట్ ఆవరణలో జిల్లా జడ్జి బి శ్రీనివాసులతోపాటు మక్తల్ కోర్టు జడ్జ్ అవినాష్ ను మర్యాదపూర్వకంగా కలవగా… శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆధ్వర్యంలో భారత్ అసోసియేషన్ సభ్యులు నూతనంగా ఎన్నికైన అడ్ హక్ కమిటీ అధ్యక్షుడు తిమ్మన్నను శాలువా కప్పి మర్యాదపూర్వకంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో మక్తల్ లాయర్లు ఆనంద్, భరత్ కుమార్, రాజశేఖర్, రవి గౌడ్ ,వెంకటేష్ గౌడ్, పొర్ల ఆనంద్, సునీత, సతీష కుమారి ఇతర లాయర్లు తదితరులు పాల్గొన్నారు.
