• జయప్రదమైన దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ధర్నా.

మన ధ్యాస, మక్తల్:ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం ముందు శుక్రవారం దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక చేపట్టిన ధర్నా విజయవంతమైందని కేఎన్పీఎస్ జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్ తెలిపారు.ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించి ప్రసంగించారు. దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు మరియు రైతులు అనేకమంది ఈ ధర్నాను ఉద్దేశించి ప్రసంగించారు. మన చెరువులలోని ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు తరలించడం అన్యాయమైన విషయమని, చెరువులలోని ఒండ్రు మట్టిని రైతుల వ్యవసాయ పొలాలకు ప్రభుత్వమే అందించాలని, కోరుతూ తాసిల్దార్ మక్తల్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మక్తల్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేసిన ఎలాంటి చర్యలు జరగలేదన్నారు. ఇట్టి విషయం పై మంత్రివర్యులు వాకిటి శ్రీహరిని కలిసి చెరువుల నుండి ఒండ్రు మట్టి ఇటుక బట్టీలకు అక్రమంగా వెళ్లడాన్ని ఆపదలు చేయాలని కోరినప్పటికీ ఎలాంటి ఫలితాలు లేనందున ,ఈరోజు శుక్రవారం ఈ ధర్నా నిర్వహించడం జరిగిందని దళిత ప్రజా సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు వివరించారు. రైతు పక్షపాతిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తంగా చెరువులలోని ఉండు మట్టిని రైతుల వ్యవసాయ పొలాలకు అందించడానికి చర్యలు తీసుకోవాలని, దాని ద్వారా రైతాంగానికి మరియు వ్యవసాయ రంగానికి చాలా మేలు అవుతుందని ప్రతినిధులు వివరిస్తూ కోరారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారికి కమర్షియల్ కోసం చెరువులోని ఒండ్రు మట్టిని తరలింప చేయడానికి అనుమతులు ఇవ్వడానికి చట్టం ఒప్పుకోదని విజ్ఞప్తి చేసిన సందర్భంలో “ఇకనుండి నేను ఎవ్వరికీ మట్టి తరలింపుకు అనుమతులు ఇవ్వను” అని వందల మంది ముందు చెప్పి లోపాయి కారిగా మళ్లీ అనుమతులు ఇచ్చి ప్రభుత్వ నియమాలను ఉల్లంఘించి విధులు నిర్వహిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మక్తల్ గారిని వెంటనే సస్పెండ్ చేయాలని వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసలు మొత్తంగా తాలూకా పరిధిలో చెరువుల నుండి ఎంత మట్టి తరలించ బడింది? ఎంత మట్టికి అనుమతి ఉంది? సమగ్ర విచారణ జరపాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అనుమతులకు మించి ఒండ్రు ను ఇటుక బట్టీలకు తరలింపబడిందని పెద్ద పెద్ద గుట్టలుగా వండుకుప్పలు తాలూకాలో వెలిశాయని అనుమతులకు మించి తరలించిన మట్టిని ప్రభుత్వం రికవరీ చేసుకోవాలని దాన్ని రైతుల భూములకు అందివ్వాలని ప్రభుత్వాన్ని ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. రాత్రనకా పగలనకా గత 20 రోజుల నుండి రోజు వేలాది టిప్పర్ల ఒండ్రు మట్టిని ఇటుక బట్టీలకు తరలించడం జరిగిందని వారు అన్నారు. అక్రమంగా తవ్వకాలు జరిపిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి గారు దయతో ఈ విషయంలో చొరవ వహించి మక్తల్ తాలూకా పరిధిలోని చెరువులను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. చెరువులు వాగులు కుంటలు గ్రామ వారసత్వ సంపదలు,ఈ వారసత్వ సంపదను కొందరు ధనవంతులు, అవినీతిపరమైన అధికారులు, ఇటుక బట్టీల యజమానులు, ఇసుక, నల్లమట్టి మాఫియాలు కుమ్ముకై ప్రజలకు రైతులకు కాకుండా చేస్తున్నారని వారు వివరించారు. ఈ సందర్భంలో ప్రజలే తమ వారసత్వ సంపదను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అందులో భాగంగా “చెరువులను కాపాడుకుందాం” అని చెరువులోని మట్టి తవ్వకాలకు వ్యతిరేకంగా ఆయా గ్రామాల ప్రజలు ఐక్యంగా నిలబడాలని వారు పిలుపునిచ్చారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతుల వైపు పేద ప్రజల వైపు నిలబడి వారి హక్కులకై పోరాడుతామని ప్రజా సంఘాల నాయకులు తెలిపారు. పార్టీలకతీతంగా రైతాంగం, రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాడాలని ఆ దారిలోనే చెరువులను కాపాడుకుంటామని, చెరువులలోని ఒండు మట్టి మన పొలాలకు అందుతుందని వారు తెలిపారు. ఈ ధర్నా ప్రారంభానికి ముందు సీఐ గారు టెంట్ వేసుకునుటకు అనుమతి పొందలేదని తెలుపగా ప్రజాసంఘాల నాయకులు టెంట్ ను తొలగించి ఎండలో కూర్చొని వందలాది మందితో ధర్నా నిర్వహించడం జరిగింది. అనంతరం ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం లోని డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ గారి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర గారికి మెమోరండం పంపించడం జరిగింది. ఆ తరువాత ధర్నాలో పాల్గొన్న రైతులంతా కలిసి అంబేద్కర్ విగ్రహం చేరుకొని అంబేద్కర్ కు పూలమాలవేసి అక్కడినుండి మక్తల్ తహసీల్దారు గారి కార్యాలయానికి చేరుకొని వారికి మెమోరండం ఇచ్చి ముఖ్యమంత్రి పంపాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అఖిలభారత ఐక్య రైతు సంఘం జిల్లా అధ్యక్షులు భగవంతు, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రామాంజనేయులు గౌడ్, కుల నిర్మూలనా పోరాట సమితి జిల్లా అధ్యక్షులు డి చంద్రశేఖర్, సిఐటియు జిల్లా అధ్యక్షులు గోవిందరాజు, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షులు పృథ్వీరాజు, మానవ హక్కుల కార్యకర్త బి మద్దిలేటి, టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్, బేడ బుడగ జంగం హక్కుల వేదిక నాయకులు రాజు, ఎమ్మార్పీఎస్ నాయకులు అంజి,దళిత నాయకులు జీర్గాలనాగేష్,అంబేద్కర్ సంఘం ప్రధాన కార్యదర్శి రవి, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి రంగప్ప యాదవ్, పుడమి ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి రవి, కర్ని గ్రామ రైతు నాయకులు మల్లేశ్వర్ రెడ్డి, కానపురం రైతు నాయకులు అమ్మ కోళ్ల సురేష్, కానాపురం గ్రామం మాజీ సర్పంచ్ గారు, బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు వెంకటయ్య, ఆర్.టి.ఐ హక్కుల నాయకులు నారాయణ, మహాత్మ జ్యోతిబాపూలే వారధి కమిటీ నాయకులు కె.వి.నర్సింలు, తదితరులు ప్రసంగించారు ఈ ధర్నా కార్యక్రమంలో పలు గ్రామాల రైతుల,ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *