మన ధ్యాస, మక్తల్: సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్, వాకిటి శ్రీహరి చేపట్టిన ఏరియల్ సర్వే తో, మక్తల్ నియోజకవర్గానికి మరో రెండు రిజర్వాయర్ లు రాబోతున్నాయి అని శుక్రవారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోపార్టీ నాయకులు తెలిపారు.క్రిష్ణ నది మీద మాగనూరు మండలం కొల్పూర్, కర్ణాటక రాష్ట్రం కొర్తికొండ వద్ద బ్రిడ్జి కమ్ బ్యారేజ్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు మరొకటి భీమా నదిపై క్రిష్ణ మండలం కుసుమూర్తి, కర్నాటక రాష్ట్రం సూగురు వద్ద మరోకటి బ్రిడ్జి కమ్ బ్యారేజ్ ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపారు. దీంతోపాటు మఖ్తల్ మండలం భూత్పూర్ రిజర్వాయర్ సామర్థ్యం ను ప్రస్తుతం ఉన్న 1.3 టీఎంసీల నుంచి 15 టీఎంసీల కు పెంచేందుకు ప్రభుత్వానికి ఒప్పించే విధంగా మంత్రి వాకిటి శ్రీహరి ప్రత్యేక చొరవ తీసుకోవడం జరిగింది ,ఇందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని త్వరలోనే ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నారు.మక్తల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి అయిన వాకిటి శ్రీహరి ఎమ్మెల్యేగా ఎన్నికవడమే కాకుండా మంత్రిగా సైతం బాధ్యతలు చేపట్టడంతో…ఈ ప్రాంతంలో సాగునీటి వాటా పెంచేందుకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోపాటు కర్నాటక సాగునీటి మంత్రి బోసు రాజును సైతం ఒప్పించి… క్రిష్ణ, భీమా నదులపై కనీసం రెండు చోట్ల బ్రిడ్జి కమ్ బ్యారేజ్ లు ఏర్పాటు చేయాలని, ఏరియల్ సర్వే కు ఒప్పించి, గురువారం రోజు విజయవంతంగా ఏరియల్ సర్వే పూర్తి చేశారు. అనంతరం ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికారుల సమావేశంలో…కొల్పూర్ కొర్తికుండ, కుసుమూర్తి వద్ద రెండు చోట్ల బ్రిడ్జి కమ్ బ్యారేజ్ లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. భూత్పూర్ రిజర్వాయర్ సామర్థ్యం ను 15 టీఎంసీలకు పెంచాలని ప్రభుత్వానికి మంత్రి వాకిటి శ్రీహరి కోరడం జరిగింది, అందుకుగాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడం జరిగింది, వెంటనే ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది, ప్రస్తుతం ఉన్న రిజర్వాయర్ లు, భూత్పూర్ రిజర్వాయర్ సామర్థ్యం పెంపు, రెండు కొత్త బ్రిడ్జి కమ్ బ్యారేజ్ ల ఏర్పాటు తో… మక్తల్ ప్రాంతంలో దాదాపు 20నుంచి 25 టీఎంసీల నీటిని నింపుకునే అవకాశం ఉందని , ఇందుకు కృషి చేసిన మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి గారి కి మక్తల్ నియోజకవర్గం రైతులు ధన్యవాదాలు తెలిపారు.ఉమ్మడి ప్రాజెక్టు లలో తెలంగాణ వాటా 51శాతం, కర్నాటక వాటా 49 శాతం గా ఉండనుందని మీడియా సమావేశంలో తెలపడం జరిగింది. సమావేశంలో…కాంగ్రెస్ పార్టీ నాయకులు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.గణేష్ కుమార్, మాజీ ఎంపీపీ సభ్యులు బి.చంద్రకాంత్ గౌడ్, మక్తల్ మేజర్ గ్రామపంచాయతీ మాజీ ఉపసర్పంచ్ కట్ట సురేష్ కుమార్ గుప్తా, గాయత్రి అనిల్, టౌన్ ప్రెసిడెంట్ ఏ. రవికుమార్, మార్కెట్ కమిటీ డైరెక్టర్స్ సాయి ఫైనాన్స్ శీను, ఫయాజ్ ,గోవిందరావు, నీల గౌడ్, శంకర్, చిన్న అంజప్ప, కృష్ణ తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *