మన ధ్యాస, మక్తల్: మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు.కృష్ణా , భీమా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు నుంచి నేరుగా మక్తల్ చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ జూపల్లి కృష్ణారావు లకు మంత్రి వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ ప్రియాంక లు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులపై ఫోటో గ్యాలరీని ముఖ్యమంత్రి,మంత్రులు వీక్షించారు.మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భీమా కృష్ణా నదులపై ప్రతిపాద బ్యారేజీ పనులు పురోగతికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ప్లాన్ మ్యాప్స్ ద్వారా ముఖ్యమంత్రికి ఇరిగేషన్ అధికారులు వివరించారు. తర్వాత మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కాట్రేవుపల్లి లో నిర్మిస్తున్న పంప్ హౌస్ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ వాకిటి మానస హనుమంతు, నాయకులు బాలకృష్ణారెడ్డి, కట్టా సురేష్ గుప్తా, గణేష్ కుమార్, లక్ష్మారెడ్డి, బోయ రవికుమార్, అమర్, కావలి రాజేందర్, వాకిటి శ్యామ్, మార్కెట్ డైరెక్టర్ లు, వార్డు కౌన్సిలర్ లు, సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *