తవణంపల్లె, మన ధ్యాస సెప్టెంబర్ 25: తవణం పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పల్లెచెరువు గ్రామంలో ఈరోజు స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ ఆరోగ్య శిబిరం నిర్వహించబడింది. ఈ శిబిరంలో గ్రామ ప్రజలకు రక్తపోటు, మధుమేహం, నోటి క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, తల్లి బిడ్డ సేవలు, వయోవృద్ధుల ఆరోగ్య పరీక్షలు, కిషోర బాలిక ఆరోగ్య పరీక్షలు, క్షయ వ్యాధి స్క్రీనింగ్, సికిల్ సేల్ అనీమియా స్క్రీనింగ్, ఆయుష్ సేవలు, టీకాల కార్యక్రమం, అలాగే మానసిక వైద్య సేవలు అందించబడ్డాయి. ఈ కార్యక్రమంలో డాక్టర్ కేశవ నారాయణ, డాక్టర్ ప్రియాంక, ఆరోగ్య పర్యవేక్షకులు, ఆరోగ్య కార్యకర్తలు, ఎంఎల్ఎచ్పీలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ పెద్ద సుజిత్ కుమార్ రెడ్డి కూడా హాజరై ప్రజలకు ఆరోగ్యంపై తగిన సలహాలు అందజేశారు. గ్రామ ప్రజలు ఇటువంటి ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు.









