

శంఖవరం/ ప్రత్తిపాడు మన ధ్యాస ప్రతినిధి:- పెద్దాపురం మండలం దివిలి గ్రామానికి చెందిన ముద్రగడ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కాంట్రాక్టర్ కొత్తిం బాలకృష్ణ తండ్రి శ్రీరామ్మూర్తి ఇటీవల కాలంలో మరణించడంతో వారి కుటుంబాన్ని ప్రత్తిపాడు నియోజకవర్గ వైసిపి కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు పరామర్శించి శ్రీరామ్మూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. శ్రీరామ్మూర్తి మృతి పట్ల తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. గిరిబాబు మాట్లాడుతూ బాలకృష్ణ కుటుంబానికి మా కుటుంబానికి దశాబ్దల కాలం నుండి ఉన్న అనుబంధం మరవలేనిది అన్నారు.