

మన ధ్యాస తవణంపల్లె ఆగస్ట్-27 చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లి మండలంలో వాడవాడల వినాయక వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా వినాయక చవితి గూర్చి అర్చకులు భక్తులకు వివరించారు. వినాయక విగ్రహాలకు పూలమాలల వేసి అలంకరించి తీర్థ ప్రసాదాలు భక్తులకు అందజేశారు. ఇందులో భాగంగా మిట్టపల్లి గ్రామంలో వినాయక చవితి వేడుకలు భక్తిశ్రద్ధలతో వినాయక చవితి గ్రామస్తులు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి మహిళలు పురుషులు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే తవణంపల్లె లో గల గాయత్రి పాల డైరీలో బారి వినాయక ప్రతిమను ఏర్పాటు చేసి భక్తి శ్రద్ధలతో ఆ గజాననుని దుపదీప నైవేద్యాల తో సేవించి ప్రసాదాలు పంచి పెట్టి ఆ వినాయకుని దివ్యనుగ్రహం పొందారు. ఈ కార్యక్రమంలో డైరీ కార్మికులు, మనేజ్మెంట్ మరియు భక్తులు పాల్గొన్నారు.
