

మన ధ్యాస న్యూస్ సింగరాయకొండ:-
సింగరాయకొండ మండలంలో గత నాలుగు సంవత్సరాలుగా పర్యావరణ పరిరక్షణ సందేశంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు. “మట్టి విగ్రహాలు పూజిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం” అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు.
ఈ సంవత్సరం కూడా మండల జనసేన పార్టీ సీనియర్ నాయకుడు దండే ఆంజనేయులు ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దేవినేని బాలాజీ, పసుపులేటి శ్రీకాంత్, పెద్ది శెట్టి మనోజ్ రాయల్, నితిన్ కుమార్, దినేష్, హేమంత్ తో పాటు వీరమహిళలు, జనసైనికులు పాల్గొని విజయవంతం చేశారు.