

మన న్యూస్ సింగరాయకొండ:-
మెగాస్టార్ కొణిదల చిరంజీవి జన్మదినాన్ని పురస్కరించుకొని మూలగుంటపాడులోని ఐటిఐ కాలేజ్ ముందర ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్ పిల్లలందరికీ చాక్లెట్లు పంపిణీ చేసి, కేక్ కట్ చేసి వేడుకలను ఆనందోత్సాహాలతో జరిపారు.కార్యక్రమంలో జనసేన నాయకులు, అభిమాన సంఘాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు శీలం రాము, నూతనంగా నియమితులైన చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు జమ్మూ మోహన్, మాజీ అధ్యక్షులు మొరుబోయిన వెంకట్రావు, సెక్రటరీ రసూల్ కాజా, జనసేన మండల ఉపాధ్యక్షులు చాన్ భాష, మున్నా, శీలం నారాయణ, గండే వివేక్, కోసూరి మురళి, ఆదిపోగు రాములు (చిన్నా), శీలం గోపి, బొడ్డు నాని, బొడ్డు శ్రీను, బొడ్డు హరికృష్ణ, రావినూతల శ్రీను, రావినూతల వెంకటేష్, శ్రీను, మహేష్, శివ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అభిమానులు మెగాస్టార్ సేవా కార్యక్రమాలను, సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగి, అభిమానుల హర్షధ్వానాలతో ప్రతిధ్వనించింది.