

మన న్యూస్,తిరుపతి,: తిరుపతి రూర ల్ మండల పరిధిలోని చెన్నై – బెంగుళూరు జాతీయ రహదారి లో ఉన్న హోషి ఆటో ప్రైవేట్ లిమిటెడ్ కియా కార్ షోరూంలో శుక్రవారం కియా కారెన్స్ క్లావిస్ ఈ వి కారు ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మేనేజింగ్ డైరెక్టర్ సి. జగన్నాధరెడ్డి , డైరెక్టర్లు చెరకు నిరంజన్, సి.భారతి, సి. హోషిమారెడ్డి లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా షోరూం మేనేజింగ్ డైరెక్టర్ సి. జగన్నాధ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కియా నుండి విడుదలయిన కియా కారెన్స్ క్లావిస్ ఈ వి కారులో అత్యాధునిక సదుపాయాలతో ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కారులో అత్యాధునిక టెక్నాలజీతో కూడిన నూతన ఫీచర్లు ఎన్నో ఉన్నాయన్నారు. 200 ఎం ఎం గ్రౌండ్ క్లియరెన్స్, -42 కిలో వాట్స్ బ్యాటరీ ప్యాక్ ఒకసారి ఛార్జ్ చేస్తే 404 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉందని చెప్పారు. 4 వేరియంట్లలో డ్రైవింగ్ రేంజ్ 404 కిలోమీటర్లు, 490 కిలోమీటర్లు లభ్యమవుతుందని పేర్కొన్నారు. ఈ కారు బుకింగ్ చేసుకోదలచిన వారు ఎవరైనా సెల్ 8688829739 కు సంప్రదించవచ్చునని మేనేజింగ్ డైరెక్టర్ జగన్నాథ రెడ్డి తెలిపారు.