

మన న్యూస్,తిరుపతి : తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరు తోందని రాష్ట్ర హస్తకళల కార్పొరేషన్ అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరి ప్రసాద్ చెప్పారు. శుక్రవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వ ఏడాదిపాలనపై కరపత్రాన్ని మంత్రి రామానాయుడు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ హరిప్రసాద్ మాట్లాడుతూ శాసన పరిపాలనలో పారదర్శకత ప్రజల భాగస్వామ్యం విశ్వసనీయతకు మారుపేరని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి పట్ల బీజం వేస్తూ ప్రభుత్వం తీసుకున్న బాధ్యతాయుత దృక్పథానికి నిదర్శనంగా నిలచిందన్నారు. మంత్రిని సన్మానించిన డాక్టర్ హరిప్రసాద్… నీటిపారుదల శాఖ మంత్రి రామానాయుడుకు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ కలంకారి శాలువతో ఘనంగా సత్కరించి కందూరు నరసింహస్వామి ప్రతిమను అందజేశారు.
