ఈవీఎం, వీవీప్యాట్ గోదాములకు పటిష్ట భద్రత..జిల్లా కలెక్టర్ షాన్ మోహన్

కాకినాడ, జూలై 25 మన న్యూస్ :– ఈవీఎం, వీవీప్యాట్ (ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌)ల‌కు పటిష్ట భ‌ద్ర‌త‌ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సీఈఓ, రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి పీ తాతబ్బాయి, రెవెన్యూ, ఎన్నికలు, పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు సంబంధించి చేప‌డుతున్న ఏర్పాట్ల‌ను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ భార‌త ఎన్నిక‌ల సంఘం ఆదేశాల మేర‌కు ప్రతి నెల ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, స‌మ‌గ్ర నివేదిక‌ను పంపిస్తున్న‌ట్లు వెల్లడించారు. ఈ నెల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అసిస్టెంట్ సీఈవో, ఈవీఎం నోడల్ అధికారితో తనిఖీ చేశామన్నారు. ఎల‌క్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల‌కు పటిష్ట భ‌ద్ర‌త‌ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎస్ మల్లి బాబు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నిక‌ల డిప్యూటీ త‌హ‌సీల్దార్ ఎం జగన్నాథం ఇతర ఎన్నికల సిబ్బంది త‌దిత‌రులు పాల్గొన్నారు.

Related Posts

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు,మనధ్యాస,సెప్టెంబర్11 చిత్తూరు లో ఘనంగా పెదిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు నిర్వహించారు.తనను నమ్మిన వారికోసం ఎంతదాకైనా పోరాడే మా జగనన్న సైన్యాధిపతి, పెద్దాయన మానసపుత్రుడు, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి జన్మదిన వేడుకలు హరిణి రెడ్డి ఆధ్వర్యంలో 5…

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సైబర్ మోసాల కి గురి కావద్దు అప్రమత్తంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలి సంబంధం లేని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్ ల కు స్పందించవద్దు మన ధ్యాస రిపోర్టర్ పసుమర్తి జాలయ్య సింగరాయకొండ:- దేశం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

చిత్తూరు లో హరిణి రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా మిథున్ రెడ్డి జన్మదిన వేడుకలు

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

కేబుల్ & ఇంటర్నెట్ ఆపరేటర్లబ్రతుకులు రోడ్డుపై పడతాయిసమస్యలను పరిష్కరించండి

విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

  • By JALAIAH
  • September 11, 2025
  • 3 views
విద్యార్థులు తమ తల్లిదండ్రులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించాలి.–సైబర్ క్రైమ్ సెక్యూరిటీ కౌన్సిల్ ప్రదీప్ కొత్తపల్లి పిలుపు.

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

సురక్షత మైన డ్రైవింగ్ కుటుంబానికి భద్రత…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

విద్యార్థుల సామర్థ్యాలకు అనుగుణం గానే బోధన…

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..

సిఫార్సు మోతాదులోనే రైతులు ఎరువుల వాడకం చేపట్టాలి..