కాకినాడ, జూలై 25 మన న్యూస్ :- ఈవీఎం, వీవీప్యాట్ (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల)లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి అధికారులను ఆదేశించారు. కాకినాడ కలెక్టరేట్ వద్ద ఉన్న ఈవీఎం, వీవీప్యాట్ గోదామును శుక్రవారం జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అసిస్టెంట్ సీఈఓ, రాష్ట్ర ఈవీఎం నోడల్ అధికారి పీ తాతబ్బాయి, రెవెన్యూ, ఎన్నికలు, పోలీస్ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈవీఎంల రక్షణ, భద్రతకు సంబంధించి చేపడుతున్న ఏర్పాట్లను తనిఖీ చేసి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి నెల ఈవీఎం, వీవీప్యాట్ గోదామును క్షుణ్నంగా తనిఖీ చేసి, సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు వెల్లడించారు. ఈ నెల రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అసిస్టెంట్ సీఈవో, ఈవీఎం నోడల్ అధికారితో తనిఖీ చేశామన్నారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లకు పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో ఎస్ మల్లి బాబు, కాకినాడ అర్బన్ తహసీల్దార్ వి జితేంద్ర, కలెక్టరేట్ ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ ఎం జగన్నాథం ఇతర ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.