

గద్వాల జిల్లా. మనన్యూస్ ప్రతినిధి జులై 16 :-జోగులాంబ గద్వాల జిల్లాలోని ఐజ మండలం బింగు దొడ్డి గ్రామంలో ఉదయము ఏడు గంటల నుండి 12:30 వరకు సుమారు ఐదు గంటల పాటు రైతులు వేలాదిమంది రాస్తారోకో నిర్వహించి ఆర్గనైజర్ల కంపెనీల దోపిడిని దౌర్జన్యాన్ని ఎండగట్టు తూ తీవ్ర నిరసనని తెలియజేశారు ఐదు గంటలపాటు జరిగిన ఈ రాస్తారోకోతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి ఉదయం కావడంతో కాలేజీలకి స్కూళ్ళకి వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడ్డారు ఒక సందర్భంగా మద్దతు పలికిన టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగార్జున రెడ్డి వెంకట్ రాములు మాట్లాడుతూ పువ్వు పువ్వు రుద్దే పంటను తొలగించమని గత 15 రోజులుగా రైతులను ఆర్గనైజర్లు కంపెనీలు ఒత్తిడి చేస్తున్నాయని ఇప్పటికే ఫౌండేషన్ సీడును ఇచ్చి నా ఆర్గనైజర్లు సీడ్ కంపెనీలు రైతులతో పంట వేయించి ముగ్గదశకు చేరుకున్న తర్వాత పంటను పీకి వేయమనడం తొలగించమనడం ఎంతవరకు సమంజసమని ఇప్పటికే ప్రతి ఎకరాపై రైతులు లక్ష రూపాయల పెట్టుబడి పెట్టారని అదనంగా మరో లక్ష పెట్టవలసి వస్తుందని గతంలో ఈ పంటను ఐదు క్వింటాల్ వచ్చినా 6 క్వింటాల్ వచ్చిన కొనేవారని ఈ సంవత్సరం రైతులపై కచ్చతో ఆర్గనైజర్ల దోపిడీ పెత్తనంతో తమ మాటనే నెగ్గించుకోవాలని తీవ్ర మదంతో రైతుల పట్ల వ్యవహరిస్తున్నారని ఇప్పుడు ఈ పంటను పీకి వేస్తే ఎకరాకు లక్షకు పైగా నష్టం వస్తుందని ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారని అన్నారు పంటను వేయించింది మీరే తొలగించమనేది మీరేనా అని ప్రశ్నించారు రైతులు అడుగుతున్న విధంగా రైతులు ఎంత పండిస్తే అంత పంటను కొనాలని ఒకవేళ రైతులు సంతోషంగా ఒప్పుకుంటే ఎకరాకు రెండు లక్షలు పెట్టుబడి అయిందని కనీసం లక్ష రూపాయలు చెల్లించాలని లక్ష రూపాయలు చెల్లిస్తేనే పంటను తొలగిస్తామని కోరుతున్న సందర్భంగా ఎవరు కూడా పంటను పీకి వేయకుండా కంపెనీలు ఆర్గనైజర్లు రైతులు ఎంత పండిస్తే అంత పంటను అన్ని క్వింటాలను కొనాలని లేకపోతే రైతుల పక్షాన తీవ్ర పోరాటానికి సిద్ధమవుతామని ఆయన హెచ్చరించారు ఈ ప్రభుత్వంలో రైతుల కష్టాలు మళ్లీ వచ్చాయని గతంలో ఎన్నడూ లేని విధంగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని ఇప్పటికైనా ప్రభుత్వం కల్పించుకొని సుమారు 20వేల ఎకరాల్లో వేసిన ఈ పంట తొలగింపును అడ్డుకొని ఆర్గనైజర్ లను కంపెనీలను ఒప్పించి పంట కొనే విధంగా ఆదేశించాలని పంటకొనని కంపెనీలపై ఆర్గనైజర్లపై రైతుల నష్టానికి ఆవేదనకు ఆందోళనకు గురిచేసి రోడ్ ఎక్కే విధంగా పూనుకున్న ఆర్గనైజర్లపై కంపెనీలపై పిడి యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు లేకపోతే రేపు జరగబోయే కలెక్టర్ ఆఫీసులో మీటింగ్ లో తీర్మాంగాలని చేయించాలని కలెక్టర్ కి విజ్ఞప్తి చేశారు.
