

వరికుంటపాడు,,మనన్యూస్: గురు పౌర్ణమిని పురస్కరించుకొని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మండల కేంద్రంలోని వరికుంటపాడు గ్రామంలో శ్రీ సాయిబాబా మందిరంలో ఉదయగిరి నియోజకవర్గ ప్రజలను చల్లగా చూడాలని, కరుణా కటాక్షాలు కలగాలని, వేగంగా పనులు జరగాలని ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి శ్రీ సాయినాధుని కృపకు పాత్రులు అయ్యారు.గురు పౌర్ణమి సందర్భంగా మండల మండల కేంద్రంలోని సాయిబాబా మందిరానికి చుట్టుపక్కల గ్రామాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. వారందరికీ అభివాదం చేస్తూ, గురు పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీ సాయినాధుని ఆలయంలో ఆలయ ధర్మకర్త సుంకర వెంకటాద్రి సృజనా దంపతులు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారిని శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మండల నాయకులు మండలంలోని కొన్ని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. వాటిని వెంటనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో సుంకర వెంకటాద్రి, టిడిపి మండల కన్వీనర్ చండ్ర మధుసూదన్ రావు,మాజీ మండల కన్వీనర్ వెంకయ్య, జడ్పిటిసి సభ్యులు రావెళ్ల నాగేంద్ర, టిడిపి మండల ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ యాదవ్, మండల తెలుగు యువత అధ్యక్షులు ముజ్జే లక్ష్మీనారాయణ, గ్రామ పార్టీ అధ్యక్షులు పోదా మాధవరావు, మాజీ ఉప సర్పంచ్ సుంకర రాధాకృష్ణ, మహిళా నాయకురాలు మాగంటి శాంతమ్మ, పావులూరి నాగేశ్వరరావు ,షేక్ పీరయ్య తదితరులు పాల్గొన్నారు.