తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా వెంకటేష్ చౌదరి ఏకగ్రీవం..

మన న్యూస్ తవణంపల్లె జులై-10

పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లె మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఎంపిక ప్రశాంత వాతావరణంలో జరిగింది. గురువారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలో గల పూతలపట్టు ఎమ్మెల్యే కార్యాలయంలో పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ అధ్యక్షతన తవణంపల్లె మండల ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమై తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిని ప్రకటించారు. తవణంపల్లె మండల తెలుగుదేశం పార్టీ నూతన అధ్యక్షుడిగా వెంకటేష్ చౌదరిని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికైనా వెంకటేష్ చౌదరికి ఎమ్మెల్యే అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ పట్ల వారి నిబద్ధతను కొనియాడారు. ఈ సందర్భంగా పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ మాట్లాడుతూ… పూతలపట్టు, ఐరాల, యాదమరి, బంగారుపాళ్యం మండలాల అధ్యక్షుల ఎన్నిక ఇటీవల్ల నాయకులు, కార్యకర్తల్లో ఎలాంటి మనస్పర్ధలకు తావులేకుండా నిర్వహించామో అదే తరహాలో తవణంపల్లె ‌మండల అధ్యక్షుడి ఎన్నిక ఏకగ్రీవంగా జరిగిందని ఇది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల ఐక్యతను సూచిస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీ బలోపేతానికి మండల స్థాయిలో నూతన నాయకత్వం కీలకంగా వ్యవహరిస్తుందన్నారు. ప్రజల సమస్యలపై గళమెత్తి, పార్టీ పట్ల ఉన్న విశ్వాసాన్ని మరింతగా బలపరచాలి” అని అన్నారు. గత ఎన్నికల సమయంలో పార్టీ తరఫున వీరు చేసిన కృషి మరచి పోలేనిదన్నారు. పార్టీ కోసం అహర్నిశలూ పని చేసిన వీరు పార్టీలో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆయన కోరుకున్నారు. “రాబోయే రోజుల్లో పార్టీని మండల స్థాయిలో మరింత బలోపేతం చేయాలని, పూతలపట్టు నియోజకవర్గాన్ని తెలుగుదేశం కంచుకోటగా తీర్చిదిద్దాలన్నదే మన ఆశయంగా, కార్యకర్తలంతా ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. నాయకత్వ మార్పులతో కొత్త ఉత్సాహం నింపుకుని పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని మరింతగా పెంచేలా పని చేయాలి” అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తవణంపల్లె మండల ముఖ్య నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గోన్నారు.

Related Posts

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

శంఖవరం మన న్యూస్ ప్రతినిధి;- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలోని మండల ప్రజా పరిషత్తు ప్రాధమిక పాఠశాలలు, మండల‌ పరిషత్తు ప్రాధమికోన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ ప్రాధమిక పాఠశాలు, జిల్లా ప్రజా పరిషత్తు ఉన్నత పాఠశాలలు, గిరిజన సంక్షేమ…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

_ రెఫరల్ చైర్మన్ స్లెస్సర్ బాబు శంఖవరం మన న్యూస్ ప్రతినిధి:- విద్యార్థులకు ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుందని అని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం సీతయ్యమ్మపేట రూరల్ ఇండియా సెల్ఫ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఛైర్మన్, రెఫరల్…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

మండలంలో విద్యార్థులతో మెగా పేరెంట్స్ టీచర్స్ ఆత్మీయ సమావేశాలు…

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

ఉన్నతమైన విద్య భావితరాల భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది..

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

భక్తిశ్రద్ధలతో గురు పౌర్ణమి వేడుకలు

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

గురు పౌర్ణమి వేడుకల్లో పాల్గొన్న ముద్రగడ

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

చల్లగా చూడవయ్యా..కరుణను చూపవయ్యా..కావాగారవయ్య శ్రీ సాయిబాబా.!సాయిబాబా మందిరంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రత్యేక పూజలు.!!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం.. బడివైపు ఒక అడుగు..!లక్ష్యం ఉంటే పేదరికం చదువుకు అడ్డు కాదు..మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 లో ఎమ్మెల్యే  కాకర్ల సురేష్..!