రాజాం నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి విస్తృతస్థాయి సమావేశంవైఎస్ఆర్సిపి చైతన్యంతో ముందుకు సాగాలి – మరి చెర్ల గంగారావు.

రాజాం,మన న్యూస్ , జూలై 9: రాజాం నియోజకవర్గ కేంద్రంలో బుధవారం జరిగిన వైఎస్ఆర్సిపి పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో విజయనగరం జిల్లా వైఎస్ఆర్సిపి ఉపాధ్యాయ విభాగం జిల్లా అధ్యక్షులు మరి చెర్ల గంగారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “అధికారమే గానీ ప్రతిపక్షమే గానీ – రెండూ ఒకే నాణానికి బొమ్మ బోరుసుల వంటి‌వి. సమానమైన చైతన్యంతో పనిచేయగలిగితేనే విజయాన్ని సాధించగలము,” అన్నారు.ప్రతిపక్షంలో ఉన్నా కూడా ప్రజల మనస్సుల్లో స్థిరపడిన ఏకైక పార్టీ వైఎస్ఆర్సిపి అని పేర్కొన్న ఆయన, “సంస్థను రక్షించగలిగినప్పుడే అది మనల్ని రక్షిస్తుంది. వైఎస్ఆర్సిపి ఒక సామాజిక బాధ్యత కలిగిన రాజకీయ సంస్థ. అందుకే దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉంది,” అని తెలిపారు.కార్యకర్తలు నిరాశ చెందకుండా, విశ్వాసంతో, ప్రజాస్వామ్యబద్ధంగా న్యాయ పోరాటం జరిపితే ప్రజల మన్ననలు పొందవచ్చు. తద్వారా మళ్లీ అధికారం లోకి రావడం సహజమవుతుందని చెప్పారు.ఈ సమావేశానికి రాజాం నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్‌చార్జి డాక్టర్ తలె రాజేష్ అధ్యక్షత వహించారు. స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Posts

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

మన న్యూస్ సింగరాయకొండ:- గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కోసం క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలని సింగరాయకొండ ఆయుస్మాన్ హాస్పిటల్ వైద్యాధికారులు సూచించారు.బుధవారం జరిగిన ప్రధాన మంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ కార్యక్రమంలో డా. ధీరేంద్ర, డా.…

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

మన న్యూస్ సింగరాయకొండ:- ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, పాత సింగరాయకొండ పంచాయితీ గౌదగట్లవారి పాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో కీ.శే. బూదూరి ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థంగా జాతీయ నాయకుల చిత్రపటాలను ఆయన శిష్యుడు నల్లబోతుల కొండలరావు మండల విద్యాశాఖ అధికారి…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

గర్భిణీ స్త్రీలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి – వైద్యుల హితవు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

విద్యార్థులలో గురుభక్తితో పాటు జాతీయ సమైక్యతను పెంపొందించాలి — ఎం.ఈ.ఓ కత్తి శ్రీనివాసులు

లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

లేబర్ కోడ్స్ రద్దు చెయ్యాలి — కార్మిక సంఘాల డిమాండ్

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

రైతులకు పచ్చిరొట్ట విత్తనాలు – ‘పొలం పిలుస్తుంది’ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ విజ్ఞప్తి

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

బాల్యంలో గర్భధారణ నివారిద్దాం : వైద్య అధికారి సర్దార్ వలి

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం

రాయదుర్గం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశం