గూడూరు, మన న్యూస్ :- హిందూ సనాతన ధర్మాన్ని కాపాడాలనుకొనే ప్రతి హిందూవు నీ ధర్మాన్ని.. నీ దేవుడు గుడి ఆస్తులను కాపాడుకొనే రక్షకుడువి నువ్వే… గుడికి వెళ్లే మీరు ఇచ్చే కానుకులకు హుండీలో వెయ్యకుండా.. హిందూ సనాతన ధర్మమాన్ని నమ్ముకే పూజారులకు ఇవ్వండి. వారికీ మీరు మేలు చేసేవారు అవ్వుతారు. నీ దేశాన్ని.. నీ సనాతన ధర్మాన్ని.. గోమాతని.. నిన్ను జన్మనిచ్చిన తల్లిదండ్రులను
కాపాడు కుందo…
…….సేవలు అందుకునుటయే కానీ సేవలు అందించుట ఏరుంగనివారు. ప్రస్తుత సమాజంలో ఈ విధమైన పోకడలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పూర్వం కొంత మంది ఆదర్శమైన వ్యక్తులు సేవలు అందుకునుటయే కాదు, తమని సేవించిన వారికి, తిరిగి సేవలు అందించుటయే మానవ ధర్మమని భావించేవారు. కానీ ప్రస్తుత సమాజంలో ఎదుటివారిని తమ ప్రయోజనాలకు విరివిగా ఉపయోగించుకొని, తమ అవసరాలను నెరవేర్చుకుని, తమకు సేవలు అందించడానికె ఇతరులు ఉన్నారని భావిస్తూ ఉంటారు. చివరకు సేవలు అందించిన వారికి అవసర సమయంలో ఉపయోగపడాలన్న భావన కూడా ఈ మహాశయులకు మనసున తట్టదు, ఆ విధమైన తలంపే చేయరు. అది సరైన విధానం కాదు. మనము సమాజంలో ఉన్నాము. సమాజాన్ని మన అవసరాలకు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నామో అదే భావనతో సమాజానికి ఉపయోగపడినప్పుడే సార్ధకత చేకూరుతుంది. స్వార్థము, సంకుచిత తత్వము విడనాడి సమాజము మనల్ని మంచి మనిషిగా భావించే విధముగా మనము మన గలిగితే భగవంతుడు కూడా మన పట్ల దయార్థ హృదయుడై ఉంటాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *