• మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం

శంఖవరం/ ప్రత్తిపాడు మన న్యూస్ ప్రతినిధి (అపరూప్):- కాకినాడ జిల్లా పెద్దాపురం సబ్ డివిజన్ క్రైమ్ ఏఎస్ఐ గంగిరెడ్డి బలరామ్మూర్తి ఇటీవల కాలంలో అనారోగ్యంతో బాధపడడంతో బలరామ్మూర్తి ను మాజీమంత్రి పిఎసి కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభం పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. బలరామ్మూర్తి మా కుటుంబానికి మంచి ఆప్తుడని, బలరాం త్వరగా కోలుకొని సేవలు అందించాలని మాజీమంత్రి ముద్రగడ పద్మనాభం కోరారు. ఈ కార్యక్రమంలో గౌతు స్వామి, నరిసే శివాజీ, గణేశుల రాంబాబు, పెంటకోట నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *