గూడూరు, మన న్యూస్ :- గూడూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో పరిధిలో ఉన్న రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించబడింది. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలకు పాల్పడకుండా ఉండేందుకు, వారు చట్టబద్ధంగా ప్రవర్తించాల్సిన అవసరాన్ని ఈ సందర్భంగా గుర్తుచేయబడింది. వారిని ప్రతి వారం పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని ఆదేశించడమైంది. ఏవైనా గొడవలు, దౌర్జన్య చర్యలు, బెదిరింపులు లేదా చట్టవ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొంటే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
కౌన్సిలింగ్ అనంతరం వారి వ్యక్తిగత సమాచారం, చిరునామాలు, క్రిమినల్ రికార్డులను సమీక్షించి నవీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గూడూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ , SI సుబ్రహ్మణ్యం రాజు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *