మన న్యూస్ తవణంపల్లె జూన్-28

పూతలపట్టు నియోజకవర్గం,
తవణంపల్లె మండలం, కాణిపాకం పట్నం గ్రామానికి చెందిన ప్రేమలతకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును పూతలపట్టు శాసనసభ్యులు మురళీమోహన్ అందజేశారు. శనివారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే మురళీమోహన్ ‌కార్యాలయంలో కాణిపాక పట్నం గ్రామానికి చెందిన లబ్ధిదారురాలు ప్రేమలతకు ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రూ. 50,000 చెక్కును ఎమ్మెల్యే మురళీమోహన్ అందజేశారు. సీఎం సహాయ నిధి చెక్కు అందుకున్న ప్రేమలత సీఎంకు, ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… పేద ప్రజలకు కార్పోరేట్ స్ధాయి వైద్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి క్రింద ఆర్ధిక సహాయం అందజేసి భరోసాగా నిలుస్తుందన్నారు. వైద్యపరంగా ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న నిధులను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పార్టీలకు అతీతంగా అర్హులకు సీఎం రిలీఫ్ ఫండ్ క్రింద నిధులు మంజూరు చేసి అందించడం జరుగుతుందని, ప్రేమలత ఆరోగ్య సంబంధిత సమస్యలతో బాధ పడుతుండగా, సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేయగా, వేంటనే సంబంధిత అధికారులు పంపి సీఎం సహాయ‌నిధి మంజూరు చేయడం జరిగిందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *