గూడూరు ,మన న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న *పొలం పిలుస్తుంది* కార్యక్రమము ను వెడిచెర్ల మరియు మంగళపూరు గ్రామాలలో నిర్వహించడం జరిగింది..ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి గూడూరు, వి.రమేష్ పచ్చి రొట్ట మరియు పి.ఎం.డి.ఎస్ కిట్లును సబ్సిడీ పై త్వరలో రైతులకు అందజేయడం జరుగుతుందని , ఇవి భూసారం పెంపుదలకు ఎంతగానో తోడ్పడతాయని , అలాగే నేల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతాయి కావున ప్రతి రైతు కూడా వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉద్యాన అధికారిణి యన్. సునీత ఉద్యాన శాఖ ద్వారా డ్రిప్ మరియు స్ప్రింక్లెర్ లను రాయితీ పై ఇవ్వడం జరుగుతుందని అలాగే కొత్తగా నిమ్మ , మామిడి , బొప్పాయి పంటలు వేసుకునే రైతులకు మొక్కల ఖర్చు మరియు వాటి నిర్వహణకు ఉద్యాన శాఖ సహకారం అందిస్తుందని కావున రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు కె .శివ, గ్రామ నాయకులు మరియు గ్రామ రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *