మన న్యూస్, గూడూరు . గూడూరు పరిసర ప్రాంత ప్రజలకు ట్రాఫిక్ సమస్య లేకుండా గూడూరు అశోక్ నగర్ వద్ద ఉన్న అండర్ బ్రిడ్జి వద్ద వన్ వే రూట్ అమలు చేస్తున్నామని ప్రజలందరూ పోలీసులకు సహకరించాలని గూడూరు టూ టౌన్ సిఐ శ్రీనివాస్ కోరారు గూడూరు టూ టౌన్ సిఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ అశోక్ నగర్ వద్ద ఉన్న రైల్వే అండర్ బిడ్జి వద్ద నిరంతరం ట్రాఫిక్ సమస్య వస్తుందని దీని కొరకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఊరు వన్ టౌన్ నుండి యధావిధిగా పాత అండర్ బ్రిడ్జి నుండి టూ టౌన్ కు రాకపోకలు సాగించవచ్చని చెన్నూరు గాంధీనగర్ నుండి వచ్చే వాహనాలు మినీ బైపాస్ రెండో అండర్ బ్రిడ్జి ద్వారా ఒకటవ పట్టణంలోకి వస్తాయని తెలిపారు ట్రాఫిక్ సమస్య లేకుండా చేస్తున్న ఈ ప్రయత్నానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్ట ప్రకారం చర్య తీసుకుంటామని హెచ్చరించారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *