మన న్యూస్ సింగరాయకొండ:-

నిన్న పొలం పిలుస్తోంది లో భాగంగా సోమరాజు పల్లి మరియు సింగరాయకొండ లలో గ్రామసభ లు నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సింగరాయకొండ సహాయ వ్యవసాయ సంచాలకులు ఇ .నిర్మల కుమారి పాల్గొనుట జరిగినది. ఆమె మాట్లాడుతూ పచ్చి రొట్టె ఎరువులు వాటి ప్రాముఖ్యత మరియు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఖరీఫ్ 2025 గురించి వివరించడం జరిగినది. అగ్రికల్చర్ ఆఫీసర్ టీ పూర్ణచంద్రరావు మాట్లాడుతూ వరి నారుమల్లు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రధాన పొలంలో ఎరువుల యాజమాన్యం గురించి పెంచడం జరిగినది. కార్యక్రమానికి ఏఈఓ షేక్ జహీర్, పంచాయతీ సెక్రటరీ, గ్రామ వ్యవసాయ సహాయకులు , సోమరాజు పల్లి రైతులు పాల్గొనడం జరిగినది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *