గూడూరు, మన న్యూస్:- గూడూరు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం గూడూరు నరశింగరావుపేట లోని బాలసదన్ నందు రోటేరియన్ ఎ. శ్రీనివాస ఆచారి వారి సతీమణి స్వర్గీయ శ్రీమతి దేవకి గారి జ్ఞాపకార్థం బాలసదన్ పిల్లల కి స్కూల్ బ్యాగ్ లు, ప్లేట్లు, గ్లాసులు బహూకరించి, పిల్లల కు విందు భోజనం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ప్రసంగిస్తూ, బాలసదన్ లో ఇంతకుముందు రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు చేపట్టామని , పిల్లలకు సహాయం చేస్తుంటే చాలా సంతోషంగా ఉందని, పిల్లలు అందరూ బాగా చదువుకుని వృద్ధిలోకి రావాలని, దాతకు అభినందనలు తెలిపారు.దాత శ్రీనివాస ఆచారి ప్రసంగిస్తూ, పిల్లలు బాగా చదువుకుని, మంచి ఉద్యోగం సంపాదించి అభివృద్ధి లోకి రావాలని,ఈ అవకాశాన్ని కల్పించిన రోటరీ క్లబ్ నకు ధన్యవాదాలు తెలిపారు.పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ దశరధరామిరెడ్డి గారు ప్రసంగిస్తూ, మా రోటేరియన్ శ్రీనివాసాచారి సహాయము చేయుటకు ముందు ఉంటారని, వారికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు రోటేరియన్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి రోటేరియన్ జి.జి.నాయుడు, పాస్ట్ అసిస్టెంట్ గవర్నర్ దశరధరామిరెడ్డి,రోటేరియన్స్ బాలకృష్ణ రాజు,ఎన్.వి.రత్నం, కిరణ్ చక్రవర్తి,మల్లయ్య, రాంప్రసాద్, సురేష్ రెడ్డి, రవికుమార్, సురేష్ బాబు,బాలసదన్ ఇన్చార్జి అరుణ మరియు పిల్లలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *