Gudur, Mana News :- అఖండ భారత కోసం ప్రాణాలర్పించిన మన భారత మాత ముద్దుబిడ్డ జన సంఘ వ్యవస్థాపకుడు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ 72వ వర్ధంతిని గూడూరు అర్బన్ మండల బిజెపి అధ్యక్షులు కే దయాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.గూడూరు అర్బన్ మండలం 24వ బూతులో ఉన్న బిజెపి ఆఫీస్ నందు డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గా చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్యాం ప్రసాద్ దార్శనికత, భారతదేశ ఐక్యత, సమగ్రతకు పునాది అని తెలిపారు. శ్యాం ప్రసాద్ ముఖర్జీ ఆశయాలు ఆలోచనలు భావాలు భారతదేశానికి ఎంతో ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు మాజీ మండలాధ్యక్షులు ఆరికట్ల బాలకృష్ణ నాయుడు, నియోజకవర్గ కో కన్వీనర్ కే నరేంద్ర ,నగర బిజెపి నాయకులు ఐ సురేష్ బాబు, బలి ప్రభాకర్ రావు, పరుచూరి బాలకృష్ణ గౌడ్ గుమ్మడి శ్రీనివాసరావు, కటికాల సురేష్, శివ, డాక్టర్ మహేష్, రాజు, బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *