తిరుపతి, MANA DHYASA :– డీఎస్సీ పేపర్ లీక్ ఘటన రాష్ట్ర విద్యా వ్యవస్థ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీసిందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ 37వ వార్డు అధ్యక్షులు డేరంగుల బాలాజీ డిమాండ్ చేశారు.విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎన్నో ఆశలతో పరీక్షలకు సిద్ధమవుతుంటే, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పేపర్ లీక్ జరగడం అత్యంత బాధాకరమని ఆయన అన్నారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడిన కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలు ఎప్పటికీ క్షమించరని విమర్శించారు. డీఎస్సీ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యంపై ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించి, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డేరంగుల బాలాజీ డిమాండ్ చేశారు.