మన న్యూస్, నారాయణ పేట జిల్లా: పరిధిలోని మక్తల్ బస్టాండ్ లో దొంగతనాలు నిర్మూలించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పూర్తి స్థాయిలో నిఘా ఉంచి, ఫింగర్ ప్రింట్ డివైస్ తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని మక్తల్ ఎస్ ఐ భాగ్యలక్ష్మి రెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి మాట్లాడుతూ, మక్తల్ బస్టాండ్ లో అనుమానిత వ్యక్తులను ఫింగర్ ప్రింట్స్ డివైస్ తో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరిగిందని, బస్టాండ్ లో ప్రయాణికుల మాటున కొంతమంది వ్యక్తులు రద్దీగా ఉన్న సమయంలో దొంగతనాలకు పాల్పడుతున్నారని అలాంటి వాటికి చెక్ పెట్టడానికి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. బస్సుల్లో ప్రయాణించేటప్పుడు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. బస్టాండ్ లో ప్రయాణికులు బస్సు ఎక్కి దిగే సమయంలో జాగ్రత్తలు పాటించాలని మరియు తమ విలువైన బంగారు వస్తువులను బ్యాగులను, పర్సులను జాగ్రత్తగా ఉంచుకోవాలని మరియు అపరిచిత వ్యక్తులు ఏమైనా తినుబండరాలిస్తే తీసుకోరాదని ప్రయాణికులకు సూచించారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100 కి లేదా లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. ఈ తనిఖీల్లో పోలీసులు మహేష్, శ్రీహరి పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *