

మన న్యూస్ సాలూరు జూన్ 12 :– పార్వతిపురం మన్యం జిల్లా సాలూరులో రేషన్ బియ్యాన్ని ఒడిస్సా తరలిస్తున్నారన్న సమాచారం మేరకు రెవెన్యూ అధికారులు ఆ బియ్యాన్ని . గురువారం Ap 39 TE 7153 నెంబర్ గల ఆటోలో రేషన్ బియ్యాన్ని ఒడిస్సాకు చెందిన బండ కొల్లు అనే వ్యక్తి తరలిస్తుండగా సివిల్ సప్లై డిటి రంగారావు, హుటాహుటిన పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి ఆటోను సీట్ చేశారు. అనంతరం 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తిపై 6a కేసును నమోదు చేసి ఆ బియ్యాన్ని గోడౌన్ కు తరలించారు.
