మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని దామరగిద్ద మండలం కానుకూర్తి గ్రామంలో నేరాల నిర్మూలనకై శాంతి భద్రతల పరిరక్షణ కొరకై గార్డెన్ సెర్చ్ కమ్యూనిటీ కాంట్రాక్టు ప్రోగ్రాం నిర్వహించడం జరిగిందని నారాయణ పేట సీఐ శివశంకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 30 మంది పోలీస్ అధికారులు సిబ్బందితో కలిసి కార్డెన్ సెర్చ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. సరైన ద్రువ పత్రాలు లేని 24 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.నేరాల నిర్మూలన కొరకే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుందని, ప్రజల రక్షణ, ప్రజలకు భద్రత భావం, సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పించడం గురించి, ఎవరైనా కొత్త వ్యక్తులు గాని నేరస్తులు గాని వచ్చి షెల్టర్ తీసుకుంటున్నారా అనే విషయం కూడా తెలుస్తుందని మరియు చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని కోరారు. వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, వాహనాల సంబందించిన అని ధ్రువపత్రాలు కల్గి ఉండాలి అన్నారు. మహిళ పట్ల, చిన్న పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన, చట్టపరమైన చర్యలుతీసుకోవడం జరుగుతుంది అని తెలిపారు.
ప్రజలు, మహిళలు ఆపద సమయంలో స్థానిక పోలీసులకు లేదా డయల్ 100 కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని తెలిపారు. ప్రజల రక్షణ కొరకు పోలీసులు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారు అని తెలిపారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు స్వచ్ఛందంగా సీసీ. కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సీ ఐ తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్ఐ లు రాజు, రాముడు, మహేశ్వరి, ఆర్ ఎస్ ఐ లు శివ శంకర్, మద్దయ్య, పోలీసు కానిస్టేబుల్స్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *