మన న్యూస్ పాచిపెంట మే 29:– పార్వతిపురం మన్యం జిల్లాపాచిపెంట మండలంలో నవధాన్యాలు సాగు చేసి కలియ దున్నడం ద్వారా భూసారాన్ని పెంచవచ్చని భూమిలో ఎంత ఎక్కువ సేంద్రియ పదార్థం ఉంటే అంత ఎక్కువగా రసాయన ఎరువులు పై ఆధారపడడం తగ్గుతుందని వ్యవసాయ అధికారి కే తిరుపతి రావు అన్నారు. చెరుకుపల్లి గ్రామంలో రైతు మన్యం చంద్రశేఖర్ తన ఐదు ఎకరాల పొలంలో వేసిన ఎక్కువగా పెరిగిన నవధాన్యాలను పరిశీలించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ నేలలో ఎన్ని ఎక్కువ రకాలను వేసి కలియ దున్నితే అంతా ఎక్కువ సూక్ష్మజీవులు వేర్ల వ్యవస్థ చుట్టూ చేరి జీవ ద్రవ్యాన్ని పెంచుతాయని నేలలో ఎంత ఎక్కువగా జీవ వైవిధ్యం ఉంటే నేలలు అంత ఎక్కువగా సారవంతం అవుతాయని తెలిపారు ఈ సందర్భంగా రైతు చంద్రశేఖర్ మాట్లాడుతూ తాను 18 రకాల విత్తనాలను కంది గోంగూర తోటకూర అలసందలు పెసర మినుము మొక్కజొన్న జోడి గంటి తెల్ల జొన్న వంటి విత్తనాలను చల్లానని ఇప్పుడు ఏపుగా పెరిగాయని కలియ దున్నిన తర్వాత మూడు ఎకరాలలో మొక్కజొన్న రెండు ఎకరాలలో పసుపు పండిస్తానని తెలిపారు వరి పంటకు ముందు కూడా రైతులందరూ నవధాన్యాలు వేసుకుని కలియ దున్నుకుంటే నేల సారవంతమవుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వి ఏ ఏ నాగమణి ఏపీ సీఎం అఫ్ ప్రతినిధులు విజయ్ మరియు సురేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *