వెదురుకుప్పం, Mana News :- వెదురుకుప్పం మండల కేంద్రంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహమునకు గత 18 సంవత్సరాలుగా నీటి సమస్య ఎదుర్కొంటున్న సందర్భంలో ఎమ్మెల్యే దృష్టికి స్థానిక టిడిపి నేత మోహన్ మురళి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ థామస్ శనివారం బోర్ వేయించే చర్యలు చేపట్టారు. సదర బోరు నందు నీరు పుష్కలంగా రావడంతో పిల్లల తల్లిదండ్రులు, స్థానికులు హర్షం వ్యక్తపరిచారు. గతంలో వసతి గృహానికి త్రాగునీటి వసతి లేకపోవడం వల్ల పిల్లలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వసతి గృహానికి పంచాయతీ నీరు మాత్రమే అందుబాటులో ఉంటున్నది. పంచాయతీ నీరు అందుబాటులో లేని సమయాల్లో వారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు సదరు విషయమై గతంలో పలు పర్యాయములు అప్పటి వైసిపి నేతల దృష్టికి తీసుకువెళ్లిన వాళ్లు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం గమనించదగ్గ అంశం. ఎమ్మెల్యే త్వరగా చర్యలు చేపట్టడం పట్ల హర్షిస్తూ ధన్యవాదాలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *