మన న్యూస్, నారాయణ పేట:- జిల్లా పరిధిలోని మరికల్ మండలంలో ప్రజలందరు బక్రీద్ పండుగను కలిసిమెలిసి శాంతియు తంగా జరుపుకోవాలని మరికల్ సీఐ రాజేందర్ రెడ్డి అన్నారు.మంగళవారం మరికల్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన శాంతి సమావేశంలో ఆయన మాట్లాడుడారు.బక్రీద్ పండుగ సందర్భంగా గొర్రెలు కోసే వారు వాటి చెత్తను పరిసరాలకు దూరంగా వేయాలన్నారు. ప్రజలందరు పరిసరాలు పరిశు భ్రంగా ఉంచడానికి సహకరించాలన్నారు. అలాగే ఆవులను, చిన్న ఎద్దులను వధించొద్దని సూచించారు. ఆవులను వధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే హిందూ ముస్లిం మత పెద్దలు చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని అన్నారు. ఏదైనా సమాచారం ఉంటే పోలీసులకు తెలుపాలని కోరారు. చట్ట వ్యతిరేకంగా వ్యవహరించిన వారి పై కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. శాంతిభద్రతల ను కాపాడడంలో పోలీసులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మరికల్ ఎస్సై రాము,హిందూ ముస్లిం ఇరువర్గాల పెద్దలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *