మన న్యూస్ ,కోవూరు, మే 9:– కోవూరు నియోజవర్గం విడవలూరు మండలం అన్న రెడ్డి పాలెం గ్రామానికి చెందిన వైసిపి బీసీ మండల యువత అధ్యక్షులు ఉప్పాల శివకుమార్ శుక్రవారం కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… స్థానిక నాయకులు అచ్యుత్ రెడ్డి నాయకత్వంలో కొవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు గ్రామంలో ప్రభుత్వ అమలు చేస్తున్న పథకాలను పార్టీలకు అతీతంగా అమలుపరుస్తామని అదేవిధంగా రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేస్తామని ఆయన తెలిపారు.
