Mana News :- అమరావతి: టెన్త పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు. అధికారిక వెబ్‌సైట్‌ ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే మనమిత్ర వాట్సాప్‌, లీప్‌ మొబైల్‌ యాప్‌లలో ఫలితాలను చెక్‌ చేసుకోవచ్చు. 9552300009 నంబరుకు హాయ్‌ అని మెసేజ్‌ చేసి, విద్యా సేవల ఆప్షన్‌ ద్వారా ఫలితాలను పీడీఎఫ్‌ కాపీ రూపంలో పొందవచ్చు. ఈ సంవత్సరం, 6,14,459 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 4,98,585 మంది ఉత్తీర్ణులయ్యారు, 81.14% ఉత్తీర్ణత సాధించారు. పార్వతీపురం మన్యం జిల్లా 93.90% ఉత్తీర్ణత రేటుతో అగ్రస్థానంలో ఉంది. 1,680 పాఠశాలలు 100% ఫలితాలను సాధించాయి. ఉత్తీర్ణులైన విద్యార్థులందరికీ మంత్రి నారా లోకేష్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 19 నుండి 28, 2025 వరకు జరుగుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *