

కడప జిల్లా: గోపవరం: మన న్యూస్: ఏప్రిల్ 23: బద్వేల్ వ్యవసాయ డివిజన్ పరిధిలోని గోపవరం మండల కేంద్రం లోని మండల సమాఖ్య వెలుగు కార్యాలయంలో ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు, మహిళా రైతులు,శ్రీ జి. రామ కృష్ణయ్య ,మండల వ్యవసాయ అధికారి, వెలుగు సీసీ లు, గ్రామ సమాఖ్య ప్రతినిధులు, గ్రామ సమాఖ్య సహాయకులు, బద్వేల్ వ్యవసాయ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు ఎం నాగరాజ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బద్వేల్ వ్యవసాయ డివిజన్ సహాయ వ్యవసాయ సంచాలకులు మాట్లాడుతూ, గోపవరం, బేతయపల్లి, రాచాయ పేట, టి. సండ్ర పల్లి, ఎస్. రామాపురం గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయము అమలు చేయడం జరుగుతోంది.
ప్రతి రైతు ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబించాలి అని తెలిపారు. పీఎండీస్ నవధాన్యాలు సాగు తో 365 రోజులు పంటలు సాగు చేయాలని రైతులకు సూచించారు.
ప్రతి ఇంటికి న్యూట్రి గార్డెన్స్, హోమ్ కంపోస్టింగ్ అవసరం నవధాన్యాలు కిట్స్, న్యూట్రీ గార్డెన్ కొరకు విత్తనాలు ప్యాకెట్లు గ్రామ సమాఖ్య నుండి ఋణం తో తయారు చేసి లబ్ది దారులకు అమ్మి తిరిగి రుణం చెల్లించాలి అని తెలిపారు. ఘన, ద్రవ జీవామృతం తయారీ,వినియోగం, వివిధ రకాల కషాయాలు ద్రావణాలు గురించి వివరించడం జరిగింది. అలాగే జాతీయ నూనె గింజలు అభివృధి పథకం, జాతీయ ఆహార భద్రత మిషన్ కింద చిరుధాన్యాలు పప్పు దినుసులు సాగు , విలువ జోడింపు, పంటల సరళి పై అవగాహణ కల్పించడం జరిగింది. రైతుల విశిష్ట గుర్తింపు సంఖ్య, పీఎం కిసాన్ పథకం, ఈ పంట నమోదు,మట్టినమునాల సేకరణ, భూసార పరీక్ష ఫలితాలు ఆధారంగా ఎరువుల వాడకం, వ్యవసాయ యాంత్రికరణ పథకం కింద 50శాతం సబ్సిడీ పై వివిధ రకాల వ్యవసాయ పనిముట్లు, సస్య రక్షణ పరికరాలు, ట్రాక్టర్ ఆధారిత పనిముట్లు రైతులకు అందించడం జరుగుతుంది… అవసరమైన రైతులు సంబంధిత రైతు సేవా కేంద్రం లో సంప్రదించాలి. ఖరీఫ్,25 కు
త్వరలో 50% సబ్సిడీ పై పచ్చిరొట్ట ఎరువుల విత్తనాలు (జీలుగ, జనుము, పిల్లి పెసర) పంపిణీ చేయడం జరుగుతుంది.. 50 శాతం సబ్సిడీపై వివిధ రకాల పురుగు మందులను జాతీయ ఆహార భద్రత మిషన్, నూనె గింజలు అభి వృద్ధి పథకం కింద పంపిణీ చేయడం జరిగింది. అలాగే పెరటి తోటల పెంపకం నిమిత్తo కూరగాయలు, ఆకుకూరల విత్తన ప్యాకెట్ లు పంపిణీ చేయడం జరిగింది. పెద్ద గోపవరం కు చెందిన శ్రీమతి కుమారి గత 3 సంవత్సరాల కు పైగా ప్రకృతి వ్యవసాయ విధానాలు అవలంబిస్తున్నారు.