

కడప జిల్లా: బద్వేల్: మన న్యూస్: ఏప్రిల్ 24: బద్వేల్ మున్సిపాలిటీ లోని స్థానిక తెలుగు గంగా కాలనీలో ఉండే నారాయణ ఒలంపియాడ్ స్కూల్ నందు బుధవారం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో బద్వేల్ నారాయణ విద్యార్థులు మార్కుల ప్రభంజనాన్ని నెలకొల్పారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిషోర్ తెలిపారు. మా విద్యార్థులు100% ఉత్తీర్ణత సాధించారన్నారు. అత్యధికంగా సాయిరాం గణేష్ అనే విద్యార్థికి 591 మార్కులు సాధించారన్నారు. గౌరీష్ కుమార్ 590, చరిష్మా 590 మార్కులు సాధించారు. మొత్తం 50 మంది విద్యార్థులలో 590 మార్కులకు పైగా ముగ్గురు విద్యార్థులు, 550 మార్కులకు పైగా 22 మంది విద్యార్థులు, 500 మార్కులకు పైగా 36 మంది విద్యార్థులు ఈ ఘనత ను సాధించారు. సబ్జెక్టు వారిగా అత్యధిక మార్కులు తెలుగు 100, హిందీ 98, ఇంగ్లీష్ 98, మ్యాథ్స్ 100, సైన్స్100, సోషల్100 మార్కులు సాధించారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించడానికి కారణమైన నారాయణ విద్యా సంస్థ యొక్క ప్రణాళికలు, ఉపాధ్యాయుల కృషి, తల్లిదండ్రుల సహకారం సహకరించాయని ఉపాధ్యాయులకు విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు కిషోర్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఏజీఎం నజీర్ అహ్మద్, ప్రిన్సిపాల్ కిషోర్, అకాడమిక్ డీన్, వైస్ ప్రిన్సిపల్స్, ఏవో, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.