గద్వాల జిల్లా మనన్యూస్ ప్రతినిధి ఏప్రిల్ 21 :- జోగులాంబ గద్వాల జిల్లా మానవపాడు మండలకేంద్రంలోని ఆరుగాలం కష్టపడి పండించిన మిరప పంటను రైతులు కల్లాలలో ఆరబెట్టారు. ఆదివారం రాత్రి కురిసిన అకాల వర్షానికి కల్లాలలో ఆరబెట్టిన మిరప పంట తడిసి ముద్దయిపోయింది. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విజయుడు మానవపాడు గ్రామానికి చేరుకుని రైతులను పరామర్శించి మిర్చి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ అలంపూర్ నియోజకవర్గం లోని మిర్చి రైతులను ప్రభుత్వం ఆదుకుని వారికి నష్టపరిహారంతో పాటుగా మిర్చి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అలంపూర్ నియోజకవర్గం రైతుల సమస్యలను వ్యవసాయ శాఖ మంత్రి, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకొని వెళ్లి న్యాయం జరిగే విధంగా చూస్తానని ఎమ్మెల్యే రైతులకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *