వెదురుకుప్పం, మన న్యూస్ :– ఈ రోజు సోమవారం పచ్చికాపలం హై స్కూల్/కాలేజ్ లో ఒక భావోద్వేగమైన ఘట్టం జరిగింది. గత 35 ఏళ్లుగా విద్యారంగానికి అంకితమైన ప్రియమైన ఉపాధ్యాయుడు సిద్ధయ్య గారు రిటైర్మెంట్ తీసుకున్నారు. సిద్ధయ్య గారు, తమ సేవా కాలంలో వేలాది మంది విద్యార్థుల జీవితాలకు మార్గదర్శకులయ్యారు. ఆయన బోధనలో ఉన్న నిబద్ధత, పద్ధతి, ప్రేమ ఎంతో మందిని ప్రభావితం చేసింది. తెలుగు భాషకి పట్టాభిషేకం చేసిన విధానం, విద్యార్థుల వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే శైలి అందరికీ గుర్తుండిపోయేలా చేసింది. ఈ సందర్భంగా, స్కూల్ తరఫున విద్యార్థులు, టీచర్లు కలిసి ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. తన దగ్గర చదువుకున్న పూర్వ విద్యార్థులందరూ వచ్చి సిద్దయ్య గారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తన దగ్గర చదువుకున్న తిరుమలయ్య పల్లి పదవ తరగతి బ్యాచ్ 2006 వ తరగతి బ్యాచ్ సిద్దయ్య గారిని ఘనంగా సన్మానించి సిల్వర్ మెమొంటోని బహుకరించారు తమ జీవితకాలంలో ఎన్నో పాఠాలు గుణపాటాలు మాకు నేర్పి తమ యొక్క జీవితాలు ఈరోజు గొప్పగా రావడానికి సిద్దయ్య గారి పాఠాలే కారణమని పూర్వ విద్యార్థులు తెలిపారు. అక్కడికి రాలేని , పూర్వ విద్యార్థులు వీడియో సందేశాల ద్వారా తమ గౌరవాన్ని వ్యక్తం చేశారు. సిద్ధయ్య గారు మాట్లాడుతూ, విద్యారంగం నన్ను మలిచింది. విద్యార్థులతో గడిపిన ప్రతి రోజు నా జీవితంలోని స్వర్ణయుగం.” అని తెలిపారు. తిరుమలయ్య పల్లి 2006వ సంవత్సరం 10వ తరగతి విద్యార్థుల తరఫున సిద్ధయ్య గారికి గౌరవపూర్వక నమస్సులు. మీరు రిటైర్ అయితేనేంటి, మీ బోధనలు మాత్రం ఎప్పటికీ మా హృదయాల్లో ఉండిపోతాయని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed