మన న్యూస్ సాలూరు ఏప్రిల్ 10 :- పించను కోసం ఎదురుచూసి చూసి ఆశ్రయం లేక వితంతువు అనారోగ్యంతో బుధవారం మృతి చెందింది. సాలూరు మండలం కూర్మరాజుపేట గ్రామస్తుల సమాచారం మేరకు ఆ గ్రామంలో నివసిస్తున్న వంజరపు అన్నపూర్ణ (62) వితంతువుకు గత రెండు సంవత్సరాల క్రితం ఆమె భర్త కన్నయ్య మృతి చెందిన దగ్గర నుండి, ఆమె పించను కోసం సచివాలయాలు చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్న పించను మంజూరు కాలేదన్న మనస్థాపనతో మంచాన పడి బుధవారం ఆమె మృతి చెందింది. ఇలా బర్తలు చనిపోయిన వితంతువులు ఎంతమందో కొత్త పించను కోసం ఏళ్ల తరబడి పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం స్పందించి త్వరితగతిన కొత్త పెన్షన్ విధానం అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.









