

మనన్యూస్,గద్వాల జిల్లా:జోగులాంబగద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుటన్‌దొడ్డి శివారు, ఎర్రవల్లి నుండి కర్నూలు రోడ్డులో ఓవర్ స్పీడ్ కారణంగా ఒక కారు అదుపుతప్పి ముందున్న మరో కారును ఢీకొట్టిన సంఘటన చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న కారు అకస్మాత్తుగా నియంత్రణ కోల్పోయి, ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతో రెండు కార్లు దెబ్బతిన్నాయి.అదృష్టవశాత్తూ, ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు.
