Mana News :- కార్వేటినగరం మండలం పళ్లిపట్టు మూడు రోడ్ల కూడలి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆళత్తూరుకు చెందిన శ్రావణ్ కుమార్, చెన్నకేశవ అనే ఇద్దరు బర్త్‌ డే పార్టీకి వెళ్లి తిరిగి కార్వేటినగరం నుంచి బైక్‌పై వస్తూ డివైడర్‌ను ఢీకొన్నారు. ఈ ఘటనలో శ్రావణ్ కుమార్ అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. చెన్నకేశవ పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *