పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు.. పచ్చ మీడియా సిగ్గుపడాలి: భూమన

Mana News, తిరుపతి :- సూపర్‌ సిక్స్‌ హామీలు అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు వైఎస్సార్‌సీపీ నాయకులు భూమక కరుణాకర్‌ రెడ్డి. అలాగే, సంపద సృష్టించలేకపోతున్నా అంటూ చంద్రబాబు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, పోసాని ఆరోగ్యంపై విషపు రాతలు రాస్తున్న ఎల్లో మీడియా సిగ్గు పడాలని చురకలు అంటించారు. చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌ రెడ్డి తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చి కూటమి నేతలు ప్రజలను మోసం చేశారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబు ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభవలో కోతలు పెట్టారు. బడ్జెట్‌లో నిరుద్యోగ భృతి ఊసే లేదు. హామీలను గాలికి వదిలేశారు. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు అయినప్పటికీ ప్రజలకు చేసిందేమీ లేదు. సంక్షేమం పట్టించుకోవడం లేదు.. అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. మీరు ప్రజల్లోకి వెళ్తే పేదలు కష్టాలు తెలుస్తాయి. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు. 2లక్షల కోట్లు పేదలకు పంచిన వ్యక్తి వైఎస్‌ జగన్‌. పేదలకు మంచి చేశారు కాబట్టే వైఎస్‌ జగన్‌కు 40 శాతం ఓట్లు వచ్చాయి. మంచి చేశాం కాబట్టే వైఎస్సార్‌సీపీ పట్ల ప్రజల్లో సానుభూతి వ్యక్తమవుతోంది. సోషల్‌ మీడియాలో వైఎస్సార్‌సీపీ బలంగా ఉంది అంటూ పచ్చమీడియాలో వార్తలు రాస్తున్నారు. వాస్తవానికి ప్రభుత్వం పట్ల టీడీపీ సానుభూతిపరుల్లోనే వ్యతిరేకత ఉంది. కూటమికి ప్రజలు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వైఎస్సార్‌సీపీ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.కుట్రలతో పోసాని కృష్ణమురళిపై అక్రమ కేసులు పెట్టారు. ప్రతీకార కక్షతో చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. పోసాని ఆరోగ్య పరిస్థితిపై నాటకాలు అంటూ విష ప్రచారం చేస్తున్న పచ్చ పత్రికలు సిగ్గుపడాలి. ఆయన ఆసుపత్రిలో ఉన్నా బెయిల్‌ వచ్చే పరిస్థితి లేదు. ఆయనపై ఎల్లో మీడియా ఎందుకు విషపు రాతలు రాస్తోంది. పోసానికి వచ్చిన పరిస్థితి మీకు ఎదురైతే ఇలానే ఆలోచిస్తారా? అని ప్రశ్నించారు. 

Related Posts

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

మన న్యూస్, కావలి,ఏప్రిల్ 24 :– మాజీ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ…… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోమిశెట్టి మధుసూదన్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ…

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

మన న్యూస్,కావలి, ఏప్రిల్ 24:-*కుటుంబ సభ్యులని పరామర్శించిన ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా ఎస్పీ.*కుటుంబానికి అండగా ఉంటామని హామీ.ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి మాట్లాడుతూ…కశ్మీర్ ఉగ్రవాద ఘటన పిరికిపంద చర్య,పేద కుటుంబానికి చెందిన మధుసూదన్ మృతి చెందడం దురదృష్టకరం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You Missed Mana News updates

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

జమ్మూకాశ్మీర్ ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన కావలికి చెందిన మధుసూదన్ పార్థివ దేహాన్ని మోసి , నివాళులు అర్పించిన కావలి మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

కాశ్మీర్ ఉగ్రవాదుల కాలుపులో ప్రాణాలు వదిలిన మధుసూదన్ భౌతిక కాయానికి నివాళులు అర్పించిన కావలి ఎమ్మెల్యే దగు మాటి కృష్ణారెడ్డి, కలెక్టర్ ఆనంద్

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

మంత్రి నారా లోకేష్‌ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలకు మహర్ధశ…… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

స్టేట్‌ ర్యాంకర్‌కు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందన

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

విద్యార్థినికి కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అభినందనలు

పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి

పాడి రైతులకు మేలు చేయండి……….. కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి