• మాస్టర్ సయ్యద్ ఇస్మాయిల్.

మన ధ్యాస, మక్తల్: కరాటే తో శారీరక మానసిక ప్రశాంతత చేకూరుతుందని మాస్టర్ బుడోకాన్ కరాటే సంస్థ ఫౌండర్ మాస్టర్ సయ్యద్ ఇస్మాయిల్ తెలిపారు. ఆదివారం బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యార్థులకు కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్టులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఎల్లో, ఆరెంజ్, మెరూన్, బ్రౌన్ బెల్టులు తోపాటు ప్రశంసా పత్రాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరాటే తో అనేక ప్రయోజనాలు ఉన్నాయని, కేవలం ఆత్మరక్షణకు మాత్రమే కాకుండా సత్సంబంధాలు పెంపొందించేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ బుక్కా శంషుద్దీన్, అశోక్ గౌడ్ , శ్రీనివాస్ గౌడ్, బాలరాజ్, హఫీజ్ ,మహమ్మద్ ఇస్మాయిల్ , విశాల్, అహ్మద్ షా తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *