నిజాంసాగర్, నవంబర్ 13, (మన ధ్యాస):నిజాంసాగర్ మండల కేంద్రంలో ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్‌కు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దాస లక్ష్మణ్ దాస్ , ఉపాధ్యక్షులు సిహెచ్. కాశయ్య, ఉల్లాజీ, కార్యదర్శి అబ్దుల్ అజీజ్, సహాయ కార్యదర్శి అబ్దుల్ రహీం కలిసి ఏలే మల్లికార్జున్‌కు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు.అనంతరం మండల ఎస్ఐ శివకుమార్‌ను పోలీస్ స్టేషన్‌లో,ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీడీవో శివకృష్ణను ప్రెస్ క్లబ్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలతో సత్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ..సమాజంలో పాత్రికేయుల పాత్ర ఎంతో గొప్పదని కొనియాడారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరేలా చేయడంలో మీడియా వారధిగా పనిచేస్తుందని పేర్కొన్నారు.

ప్రజల కష్టాలు, సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయడం అభినందనీయమని తెలిపారు.నిజాయితీగా, నిష్పక్షపాతంగా వార్తలు అందిస్తూ ప్రజల పక్షాన నిలిచే పాత్రికేయుల సేవలు సమాజానికి ఎంతో అవసరమని, ప్రజాస్వామ్య వ్యవస్థలో పాత్రికేయుల స్థానం ప్రత్యేకమైనదని ప్రశంసించారు. పాత్రికేయులు ప్రజల గొంతుకగా పనిచేస్తూ సమాజ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తున్నారని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్ దినకర్, సునీల్, సాయిలు, నరేష్, లింగమయ్య తదితరులు పాల్గొన్నారు.
