మన ధ్యాస,మక్తల్: పట్టణంలోని ఎనిమిదో వార్డు బాబు జగ్జీవన్ రావు కాలనీలో సత్తెమ్మ–విష్ణు దంపతుల నూతన ఇందిరమ్మ ఇంటిని రాష్ట్ర క్రీడా , పాడి పరిశ్రమ అభివృద్ధి, పశుసంవర్ధక, మత్స్య,యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ప్రారంభించారు. అనంతరం వారికి వాకిటి వారి కానుకను అందజేసి కుటుంబ సభ్యులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొని పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి వారి ఇంట్లో వారితో పాటు నేలపై కూర్చొని కుటుంబ స్కభ్యులతో, వార్డు ప్రజలతో కాసేపు పిచ్చాపాటీగా మాట్లాడుతూ వారితో మమేకమాయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,పేదల సొంతింటి కలను సాకారం చేయడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఈ కాలనీలో విద్యుత్ దీపాలు, మంచినీటి వసతి తదితర మౌలిక సదుపాయాలు కల్పించినట్లు గుర్తు చేశారు. పేదల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా ఇందిరమ్మ ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధికి సమాన ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *