గాజువాక మన ధ్యాస ప్రతినిధి నవంబర్ 8 :ఎల్.వి నగర్ టిడిపి కార్యాలయంలో 87 వార్డ్ కార్పొరేటర్ చట్టి గోపి గెలుపును కార్యకర్తల అంగరంగ వైభవంగా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 87వ వార్డు జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు లంక మురళి దేవి బిజెపి నాయకులు కూటమి ప్రభుత్వం విచ్చేయోత్సవరా రథం అధిరోహించిన కార్పొరేటర్ చట్టి గోపికి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం విజయోత్సవ ర్యాలీ ఊరేగింపులో యువత ద్విచక్ర వాహనం తో యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.87వ వార్డు మహిళలు కార్పొరేటర్ చట్టి గోపికి హారతులతో స్వాగతం పలికి వార్డు అభివృద్ధి చేయాలని ప్రజల ఆకాంక్షిస్తున్నారని మహిళలు తెలిపారు.ఈ సందర్భంగా 87 వార్డ్ జనసేన ఇన్చార్జ్ లంక మురళి దేవి మాట్లాడుతూ 87వ వార్డు ప్రజలు కార్పొరేటర్ గా చట్టి గోపికి అత్యధిక మెజార్టీతో గెలుపొందించి కౌన్సిల్లో పంపడం ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.కూటమి ప్రభుత్వ సహకారం వార్డు అభివృద్ధి సమర్థవంతమైన నాయకత్వం గల చట్టి గోపిని గెలిపించి ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. వార్డు అభివృద్ధి అంటే కుటమీ ప్రభుత్వాన్ని విజయాన్ని విశాఖ జిల్లా లో నలుమూలల కూడా కుటమి వెలుగులు నింపారు ప్రజలు.ఈ సందర్భంగా బిజెపి నాయకుడు మాట్లాడుతూ నిత్యం ప్రజా సమస్యలపై దృష్టి సాధించే వ్యక్తి,వార్డు సమస్యలు పట్టణ ప్రజలతో అండగా ఉంటూ ప్రజా అభివృద్ధి ధ్యేయంగా ఉండే నాయకుడు చట్టి గోపి.వార్డు సమస్యలన్నీ కూడా నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.87వ వార్డు కార్పొరేటర్ చట్టి గోపి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలు నా పైన ఉంచిన నమ్మకాన్ని నేనెప్పుడూ కూడా రుణపడి ఉంటానని ప్రజా సమస్యలను ఎల్లవేళలా నెరవేరుస్తానని.ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన నేను అందుబాటులో ఉంటానని.ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు అనేక సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి సమస్యల పైన కూడా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సహకారంతో వార్డు అభివృద్ధి ముందంజ వుండే విధంగా చర్యలు చేపడతాము.ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేరుస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను.వార్డు ప్రధాన సమస్య తోకాడ, ఆటోనగర్ రహదారుల ఇబ్బందులను నెరవేర్చే విధంగా కట్టుబడి ఉంటానని ఈ సందర్భంగా తెలిపారు ప్రజలకు ప్రధాన సమస్య అయినా నీరు,డ్రైనేజీ వ్యవస్థను కూడా పునరుద్ధరిస్తానని ఈ సందర్భంగా తెలిపారు. కూటమి నాయకత్వంలో విశాఖ మేయర్ ముక్క శ్రావణి, మా తోటి కార్పొరేటర్ ఈనెల 23న కౌన్సిల్లో ప్రమాణ స్వీకారం చేస్తామని సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *