దర్గా అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి బీజేపీ నాయకులు

రేణిగుంట

తిరుపతి కార్పొరేషన్ ఎన్నికలలో గెలుపొందిన బీజేపీ పార్టీ 44వ డివిజన్ కౌన్సిలర్ మద్దేరి కరుణాకర్ రెడ్డి రేణిగుంట మిరియాల బాబా గౌసియా ఆశ్రమాన్ని విచ్చేసి ప్రతి వారం జరిగే ఫాతెహా కార్యక్రమంలో భక్తి శ్రద్ధలతో బాబా ఆశీస్సులు కోసం పాల్గొన్నారు. ఫాతెహా అనంతరం గౌసియా ఆశ్రమ పీఠాధిపతి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మషాయక్ అసోసియేషన్ తిరుపతి జిల్లా కార్యదర్శి ఖ్వాజా జుబేర్ హయాత్ అలీ షా ఖాదరీ దుశ్శాలువాతో తిరుపతి 44వ డివిజన్ కౌన్సిలర్ మద్దేరి కరుణాకర్ రెడ్డిని ఘనంగా సత్కరించి మున్ముందు మరెన్నో ఉన్నతమైన ప్రజా సేవా పదవులను అవరోహించాలని ఆశీర్వదించారు. అనంతరం ప్రతి వారం నిర్వహించే అన్నదాన కార్యక్రమంలో తిరుపతి 44వ డివిజన్ కౌన్సిలర్ మద్దేరి కరుణాకర్ రెడ్డి తన సహచరుడు ఏ1 క్యాటరింగ్ తిరుపతి యువ మోర్చా బిజెపి మైనారిటీ ప్రెసిడెంట్ ఎస్ మస్తాన్ తో కలిసి భక్తులకు అన్న ప్రసాదాన్ని వితరణ చేశారు.
ఈ కార్యక్రమంలో రేణిగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి గుడి పూజారి అయిన శ్రీ సత్యనారాయణ స్వామి, మహానంద శెట్టి, ఆంధ్ర ప్రదేశ్ మషాయక్ అసోసియేషన్ రేణిగుంట మండలం అధ్యక్షులు, డాక్యుమెంట్ రైటర్ మహబూబ్ బాషా, బాలాజీ సింగ్, తిరుపతి ఫ్యాన్సీ స్టార్ జాఫర్, రహ్మతుల్లా, చాన్ బాషా మరియు భక్తులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *