రేణిగుంట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సీడీపీఓ కె . కృష్ణవేణి ఆధ్వర్యంలో రేణిగుంట మండలం వెంకటాపురం సెక్టార్ మీటింగ్ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి పోషణ్ మరియు అంగన్వాడీ ఉత్సవ్ సేవా సంకల్ప అభియాన్ కార్య క్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా సిడిపిఓ మాట్లాడుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పోషణ్ అభియాన్ లక్ష్యాలు మరియు సందేశాన్ని తెలియజేస్తూ, ప్రతి కుటుంబం పోషకాహారంపై అవగాహన పెంపొందించుకోవడం, పిల్లలు, గర్భిణీలు, బాలింతలు మరియు కిషోర బాలికలకు సమతుల ఆహారం అందించడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి కృషి చేయాలని అవగాహన కల్పించడం జరిగింది.

గర్భిణీలు, బాలింతలు, తల్లిదండ్రులు, కిషోర బాలికలు మరియు పిల్లలకు మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత, పోషణ ట్రాకింగ్, జన ఆందోళన్, పోషకాహారం మరియు సమతుల ఆహారం యొక్క ప్రాధాన్యత గురించి అవగాహన కల్పించడం జరిగింది. వయస్సు మరియు అవసరాలకు అనుగుణంగా చంటి పిల్లలు, గర్భిణీలు, బాలింతలు మరియు కిషోర బాలికలకు అందించాల్సిన వివిధ రకాల పోషకాహారం గురించి వివరించడం జరిగింది.

అదేవిధంగా, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా అందించే పోషకాహార సేవలు మరియు వివిధ రకాల పోషకాహార పదార్థాల గురించి తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం జరిగింది. పిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు పోషకాహారం, పరిశుభ్రత మరియు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్ల ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. అంగన్వాడీ కేంద్రంలో 3-5 సం,, పిల్లల్లో శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి ,భాషాభివృద్ధి ,మేదో వికాసం ,సృజనాత్మక అభివృద్ధికి అనుగుణంగా ప్రీస్కూల్ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతున్నది. ఉత్తమ సేవలు అందించిన అంగన్వాడి కార్యకర్తకు సత్కారం చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ హేమవతి , , అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రధాన మంత్రి పోషణ్ అభియాన్ లక్ష్యాలకు అనుగుణంగా తల్లిదండ్రులు మరియు సమాజంలో పోషకాహారంపై అవగాహన పెంపొందించడం, పిల్లలు మరియు మహిళల ఆరోగ్యం, పోషక స్థితిని మెరుగుపరచడం మరియు ప్రతి కుటుంబంలో ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను ప్రోత్సహించడం లక్ష్యంగా అవగాహన కల్పించడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *